Haryana Farmer Got 200 Crore : అప్పుడప్పుడు కొంత మంది బ్యాంక్ ఖాతాలో ఉన్నట్టుండి లక్షల్లో, కోట్లలో డబ్బులు జమ కావడం వింటూ ఉంటాం. ఇలాంటి ఘటనలు తరుచు ఉత్తరభారత దేశం, ఈశాన్య భారత దేశంలో జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ కోట్లకు కోట్లు ఒక్క రాత్రిలో రైతుల ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. అయితే ఇంత మొత్తం డబ్బు జమ కావడంతో వారి ఖాతాలో నిలిపివేసిన ఘటనలు కూడా చూస్తూ ఉంటాం. అయితే పాపం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ పేద రైతులకు ఐడియా ఉండదు. దాంతో పోలీసులు ఆ వివరాలు తెలుసుకునే పనిలో పడతారు. తాజా అలాంటి ఘటనే ఒకటి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హరియాణలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. హరియాణలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు పడినట్లు గురువారం తెలుసుకున్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే విక్రమ్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుందామని నిన్న బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పింది విని అతడు షాక్ అయ్యాడు. అతడి అకౌంట్లో రూ.200 కోట్లు ఉన్నట్లు చెప్పాడు. దీంతో విక్రమ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే కొంత మంది గ్రామస్థులతో కలిసి వెళ్లి పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో పోలీసుల వాదన మరోలా ఉంది. అతని అకౌంట్ లో కేవలం రూ. 60 వేలు మాత్రమే ఉన్నట్లు తాము గుర్తించామని విక్రమ్ చెప్పినట్లు ఎక్కడా రూ. 200 కోట్లు లేవని తెలిపారు. అయితే అతడి దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్స్ తీసుకున్న పోలీసులు వాటిపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందో పూర్తి సమాచారం తెలుసుకుంటామన్నారు.