Former PM Manmohan Singh Praises Narendra Modi: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు జీ20 సమావేశాలకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను మాట్లాడారు మన్మోహన్ సింగ్. జీ20 సమావేశాలకు ఇండియా అతిథ్యం ఇవ్వడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్య దేశాల అధినేతాలతో దేశంలో సమావేశం ఏర్పటు చేయడం తాను చూడగలడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు మన్మోహన్. ప్రస్తుతకాలంలో విదేశాంగ విధానం ప్రాముఖ్యత మరింత పెరిగిందని, ఇక దేశానికి ఇది చాలా ముఖ్యమని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ పాలనలో విదేశీ విధానం జోక్యం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఇక చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జీ20 సమావేశాలకు గైర్హజరు కావడం పై కూడా మన్మోహన్ సింగ్ స్పందించారు. ఆయన రాకపోవడం బాధాకరమన్నారు. ఇక భారత్-చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంలో మోడీ ఆచీతూచీ వ్యవహరించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు మన్మోహన్ తెలిపారు. ఇక ఈ విషయంలో సలహా ఇవ్వడానికి ఇది సరైన వేదిక కాదన్నారు. ఈ వేదికపై సరిహద్దు వివాదాల గురించి కాకుండా వాతావరణ మార్పులు, గ్లోబల్ ట్రేడ్ పాలసీలు, అసమానతల గురించి ఈ వేదికపై చర్చించుకోవడం మంచిదని మన్మోహన్ సింగ్ అభిప్రాయ పడ్డారు. ఇక చైనా-ఉక్రెయిన్ విషయంలో మోదీ వైఖరిని మాజీ ప్రధాని సమర్థించారు. రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతున్నప్పుడు ఏదో ఒక దేశం వైపు నిలబడాలనే ఒత్తిడి సాధారణంగా ఉంటుందన్న ఆయన ఈ విషయంలో భారత సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఆర్థిక ఆకాంక్షలను ద్రుష్టిలో పెట్టుకొని తటస్థంగా వ్యవహరించడం గొప్ప నిర్ణయం అని, అదే సమయంలో శాంతిగా ఉండాలని కూడా మోడీ ఇరు దేశాలకు సూచించడం మంచి విషయం అన్నారు. ఈ విషయంలో భారత్ ఉన్నతంగా వ్యవహరించిందని మన్మోహన్ మోడీని కొనియాడారు. ఇక యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు ఒకసారి, 2009 నుంచి 2014 వరకు మనోహ్మన్ సింగ్ దేశానికి ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే.