Non Vegetarian Food: హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల వర్షాలు విధ్వంసం సృష్టించాయి.. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.. దీంతో “ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం”గా ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఎడతెగని వర్షం కారణంగా సంభవించిన విధ్వంసం, ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌లు, కొండచరియలు విరిగిపడటం మరియు వాలు వైఫల్యం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.. అయితే, హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న విపత్తులను వింత లాజిక్ వెతికారు ఐఐటీ ఎండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహెరా.. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. మరోసారి ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు..
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీధర్ బెహెరా.. జంతువులపై క్రూరత్వం కారణంగా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం మరియు మేఘాల విస్ఫోటనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. మాంసం తినకూడదని ప్రతిజ్ఞ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి బెహెరా మాట్లాడుతూ.. మనం ఇలాగే కొనసాగితే, హిమాచల్ ప్రదేశ్ మరింత దిగజారిపోతుంది.. మీరు అక్కడ జంతువులను చంపుతున్నారు.. అమాయక జంతువులను చంపుతున్నారు. పర్యావరణ క్షీణతతో ఇది సహజీవన సంబంధాన్ని కూడా కలిగి ఉంది.. మీరు ఇప్పుడు చూడలేరు.. కానీ, అదే నిజం అన్నారు. అయితే, బెహరాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. బెహెరా, ‘తరచుగా కొండచరియలు విరిగిపడటం, మేఘాలు పేలడం మరియు అనేక ఇతర విషయాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జంతువుల పట్ల క్రూరత్వం యొక్క ప్రభావాలే.. ప్రజలు మాంసం తినడమే కారణంగా చెప్పుకొచ్చారు. ‘మంచి వ్యక్తిగా మారడానికి, మీరు ఏమి చేయాలి? మాంసాహారం మానేయండి’’ అని విద్యార్థులకు సూచించారు.. మాంసాహారం తినకూడదని ప్రతిజ్ఞ చేయాలంటూ పిలుపునిచ్చారు. అయితే, బెహరా వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయు.. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు..
పారిశ్రామికవేత్త మరియు IIT ఢిల్లీ పూర్వ విద్యార్థి సందీప్ మనుధనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందిస్తూ.. ‘పతనం పూర్తయింది. 70 ఏళ్లలో ఏది కట్టినా ఇలాంటి మూఢ మూర్ఖులు దాన్ని నాశనం చేస్తారు. బయోఫిజిక్స్ ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ బెహెరా ప్రకటన చాలా బాధాకరమని అభివర్ణించారు. అయితే, బెహరా వ్యాఖ్యలు వివాదానికి దారితీయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, అతను మంత్రాలను పఠించడం ద్వారా తన స్నేహితులలో ఒకరిని మరియు అతని కుటుంబాన్ని దుష్టశక్తుల నుండి విడిపించాడని పేర్కొని కూడా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్‌గా మారిపోయింది.