Leading News Portal in Telugu

Mamata Banerjee: చంద్రబాబు అరెస్ట్పై మమతా బెనర్జీ ఏమన్నారంటే..!


Mamata Banerjee: ‘ఇండియా’, ‘భారత్’ అనే పేరు వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. సోమవారం ఆమే మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారత్ పేరు పట్ల తమకు అభ్యంతరం లేదు, కానీ రాజ్యాంగాన్ని సవరించకుండా భారతదేశాన్ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని తప్పు అన్నారు. అంతేకాకుండా.. మమతా బెనర్జీ మహాత్మా గాంధీ స్మారక ప్రదేశం రాజ్‌ఘాట్ గురించి కూడా ఒక ప్రకటన ఇచ్చారు. అక్టోబరు 2న మనం రాజ్‌ఘాట్‌కు వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చని, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి బెనర్జీ అన్నారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు ఎవరని సీఎం మమత ప్రశ్నించారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందని ఆరోపించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాలని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదని మమతా బెనర్జీ తెలిపారు. ఈరోజు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది, రేపు మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూడా అదే పని చేస్తుందని, ఏదైనా తప్పు జరిగితే గమనించి విచారణ చేయండి కానీ ప్రతీకారంతో ఏమీ చేయవద్దని మమతా బెనర్జీ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడుని శనివారం (సెప్టెంబర్ 9) ఉదయం అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అనంతరం ప్రస్తుతం జైలులో ఉన్నాడు.