Heroin in Soap Box: ప్రాణం పోతే పైసా వెంట రాదు.. ప్రాణం ఉంటే ఆ పైసలేనిదే పూట గడవదు. అందుకే ఆ పైసా కోసం నానా తిప్పలు పడుతుంటాడు మనిషి. కొందరు నీతిగా సంపాదించాలి అనుకుంటారు. ఇంకొందరు పైసా మే పరమాత్మ ఎలా సంపాదించాం అన్నది కాదు.. సంపాదించామా? లేదా అన్నదే ముఖ్యం అనుకుని అడ్డదారులు తొక్కుతుంటారు. ఆ తరువాత నానా తిప్పలు పడుతుంటారు. అలా అడ్డదారులు తొక్కి పోలీసులకి చిక్కినోళ్లు కోకొల్లలు.. అలాంటి సంఘటనే ఇప్పడు తాజాగా గౌహతిలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.. ఆదివారం రాత్రి పోలీసులకి అందిన సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పై గౌహతి పోలీస్ కమిషనర్ దిగంత బోరాహ్ మాట్లాడుతూ.. నిందితులు హెరాయిన్ ను సుబ్బుపెట్టెల్లో ఉంచి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించారని.. కాగా తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా నిందితులని పట్టుకున్నామని వెల్లడించారు. 198 సబ్బుపెట్టె్లో తరలిస్తున్న హెరాయిన్ ను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని.. ఆ సబ్బుపెట్టెల్లో 2.527 కిలోల బరువున్న హెరాయిన్ ఉందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులని అరెస్ట్ చేసి.. జైలుకు తరలించామని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఎండీ అమీర్ ఖాన్, ఎండీ యాకూప్, ఎండీ జమీర్ ఉన్నారు. వీరు మణిపూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.