Leading News Portal in Telugu

Bihar: సార్ మేమెక్కడ కూర్చోవాలి.. ఆగ్రహించిన విద్యార్థినులు


బీహార్‌లోని వైశాలిలో విద్యార్థినుల ఉగ్రరూపం కనిపించింది. మహ్నార్ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతిలో కూర్చోవడానికి స్థలం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) వాహనంపై విద్యార్థినులు రాళ్లు రువ్వారు. ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులకు, విద్యార్థినులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఓ విద్యార్థి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

Harsh Goenka: ఇస్రో ఛైర్మన్‌ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త

వాస్తవానికి ఈ పాఠశాలలో 2 వేల 83 మంది బాలికలు చదువుతున్నారు. కానీ కేవలం 600 మంది బాలికలకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇక్కడ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కెకె పాఠక్ 75% హాజరు కావాలని ఆదేశించారు. దీంతో 75 శాతం హాజరుపై పర్యవేక్షణ జరుగుతోంది. అందువల్ల ఆ పాఠశాలలో హాజరు శాతం పెరిగింది. ఈరోజు(మంగళవారం) 1250 మందికి పైగా బాలికలు పాఠశాలకు హాజరయ్యారు.

Ileana : టాలీవుడ్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..

వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తరగతి గదిలో కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత మహనార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అహల్య కుమారి అక్కడికి చేరుకుని విద్యార్థినులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థినులు వినకుండ ఆమె కారుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో కారు అద్దాలు పగులగొట్టారు. ఈ సమయంలో విద్యార్థినులు మహిళా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోగా.. ఓ మహిళా పోలీసుకు కూడా గాయాలయ్యాయి.

Satyender Jain: సత్యేందర్ జైన్ బెయిల్‌ ఈనెల 25వరకు పొడిగింపు

అయితే మహిళా పోలీసు విద్యార్థినులు నిరసన చేస్తుండగా.. వారిని చెప్పుతో కొట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన బాలిక విద్యార్థులు మహ్నార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాహనంపై దాడి చేశామని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మహనార్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. ఈ ఘటనపై మహనార్ బీఈవో అహల్య కుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులను ఎవరో రెచ్చగొట్టారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినులు రోజూ పాఠశాలలో కూర్చునేవారని.. కానీ ఇలా గందరగోళానికి పాల్పడ్డారని బీఈవో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమే చెప్పారు.