Leading News Portal in Telugu

Suicide: జీవితంలో ఏమీ సాధించలేకపోయాను.. జడ్జి కాలేదని మనస్తాపంతో సూసైడ్



Suicide

రాజస్థాన్‌లోని భిల్వారాలో ఆర్జేఎస్ పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రామ విహార్‌లో నివసిస్తున్న ఆకాంక్ష అలియాస్ ఖుష్బూ ఓజా (28) అహ్మదాబాద్‌లో RJS పరీక్షకు ప్రిపేర్ అయింది. అయితే ఆగస్టు 16న దాని ఫలితాలు రాగా.. అందులో ఫేయిల్ అయింది. దీంతో తీవ్రంగా కుంగిపోయిన యువతి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Read Also: Amardeep: ఒక్క నామినేషన్ తో.. ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడే ..?

యువతి ఆత్మహత్యకు ముందు తన నోట్‌లో ఏం రాసిందంటే.. ‘‘కష్టపడితే ఏదో కావాలని ఎన్నో కలలు కన్నాను.. ఎన్నోసార్లు విఫలమైనా ధైర్యంగా నిలబడ్డా.. ప్రతిసారీ ఫెయిల్యూర్‌.. ప్రతి పండగను వదిలేసి వెళ్లిపోయాను.” కానీ నిరాశే మిగిలిందని వాపోయింది. ఎప్పటికైనా జీవితంలో ఏదొకటి సాధిస్తానని అనుకునే దానిని అని తెలిపింది. అంతేకాకుండా తాను చాలా అదృష్టవంతురాలిని, తాను తన తల్లిదండ్రులను ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదని.. అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేవారని తెలిపింది. అడుగడుగునా తనకు అండగా నిలిచే సోదరుడిని పొందిన తాను చాలా అదృష్టవంతురాలిని సూసైడ్ నోట్ లో రాసింది.

Read Also: Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్జేఎస్ పరీక్ష రాసిన యువతి ఆకాంక్ష.. అందులో ఫెయిల్ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆత్మహత్యకు ఇదే కారణమా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.