జీ20కి సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశానికి వెళ్లడానికి బయలుదేరగా ఆయన పాత విమానం మొరాయించిన విషయం తెలిసిందే. కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన మరో విమానాన్ని కూడా అనుకోని పరిస్థితుల్లో లండన్‌కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, ట్రూడో తిరుగు ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయిదా పడుతుంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేన విమానంలో ట్రూడోను స్వదేశానికి తరలిస్తామని భారత్ ప్రతిపాదించగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. తమ దేశం నుంచి వచ్చిన విమానంలోనే వెళ్తానని చెప్పినట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈలోపు మన దేశంలో పాడైపోయిన విమానానికి మరమ్మత్తులు పూర్తి కావడంతో ట్రూడో మంగళవారం కెనడా వెళ్లిపోయారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్‌పోర్టులో ఆయనకు వీడ్కోలు పలికారు. ఇక జీ20 సమావేశాల్లో కెనడా ఖలిస్థాన్ గ్రూప్ ను అణిచివేయాలని ప్రధాని మోడీ కోరారు. అయితే ఇది జరిగిన అనంతరం కెనడాలోని ఖలిస్థాన్ గ్రూప్ భారత రాయబారి కార్యాలయాన్ని కెనడాలో మూసేయాలని బెదిరింపులకు పాల్పడింది. ఇలా రెండుసార్లు కాల్ చేసింది. ఇదంతా కూడా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ లో ఉండగానే జరగడం ఆశ్చర్యకరం. ఇక భారత్ లో చర్చలు జరపడంలో ట్రూడో విఫలమయ్యారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఖలిస్తాన్ గ్రూప్ ను కెనడా ప్రభుత్వం ఏం చేయడకుండా ప్రోత్సహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ గ్రూప్ ను అణిచివేయాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతుంది. అయితే కొందరు చేసిన పనిని అందరికీ ఆపాదించకూడదని జస్టిన్ ట్రూడో ప్రధాని మోడీని వేడుకున్నారు. ఇది జరిగిన కొద్ది సేపటికే ఖలిస్థాన్ గ్రూప్ నుంచి భారత్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయంటేనే కెనడాలో ఆ గ్రూప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.