Kolkata : మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్ పర్యటనకు బయలుదేరిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆమె మంగళవారం సాయంత్రం దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మమతా బెనర్జీ 12 రోజులపాటు దుబాయ్ మరియు స్పెయిన్ పర్యటనలో ఉండనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా వ్యాపార శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు.
కాగా బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో మమతా బెనర్జీ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను కలిశారు. ఈ విషయాన్ని మమతా బెనర్జీ తన x (ట్విట్టర్) ఖాతా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. “శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. నన్ను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో చూసి పలకరించారు. నవంబర్‌లో జరగనున్న రాష్ట్ర వ్యాపార సదస్సుకు ఆహ్వానించారు. ద్వీప దేశాన్ని సందర్శించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. నేను అయన ఆహ్వానాన్ని ఎంతో వినమ్రంగా స్వీకరించాను అని పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ కి ఇది లోతైన చిక్కులతో కూడిన ఆహ్లాదకరమైన పరస్పర చర్య” అని ఆమె జోడించారు.
కాగా ఈ పోస్ట్ పైన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. లవ్ యు దీది, ప్రౌడ్ అఫ్ యు దీది, వావ్.. నైస్ దీదీ.. అందరూ నిన్ను ఆరాధిస్తారు, మీ గురించి చాలా గర్వంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలను అభివృద్ధి చేసి ప్రజలను నాశనం చేసి మమతా దీదీ పర్యటనకు వెళ్లారు. వావ్ దీదీ వావ్. అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.