Brave Dog Kent Sacrifices Her Life for Solidger : ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య జరిగిన దాడిలో సైనికుడి కోసం ఒక కుక్క ప్రాణ త్యాగం చేసింది. జవాన్ ను కాపాడే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టింది. సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కెంట్ (Kent) అనే ఆరేళ్ల శునకం ప్రాణాలు కోల్పోయింది.
మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది భారత ఆర్మీ బృందం. ఆపరేషన్ సుజలిగల పేరుతో దీనిని చేపట్టిన భారత సైన్యం వారి వెంట ఆరేళ్ల కెంట్ ను కూడా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కెంట్ ముందుగా పొదల్లో వెళ్లింది. ఉగ్రవాదులు కనిపించగానే జవాన్లను అప్రమత్తం చేసింది. అయితే ఈ క్రమంలో ఆర్మీ, ఉగ్రవాదులు ఒకరిపై మరొకరు ఎదురు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో జవానును రక్షించబోయి కెంట్ ప్రాణాలు కోల్పొయింది. మంగళవారం కెంట్ ప్రాణాలు కోల్పొగా ఈ రోజు కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం ఎక్స్(ట్విటర్)లో నివాళుల అర్పించింది. దీనిని ఎంతో విచారకరమైన వార్తగా పేర్కొంటూ ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌లోని లాబ్రడార్ జాతికి చెందిన ఆడ శునకం (కెంట్) తన సైనికుడి ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిందని తెలిపింది. దేశం కోసం లాబ్రాడార్ చేసిన గొప్ప త్యాగం ఇది అని ఆర్మీ పేర్కొంది. ఇక ఈ ఎదురు కాల్పులో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా ఒక ఆర్మీ జవాన్ కూడా చనిపోచాడు. ఎదురుకాల్పుల్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) సహా మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు.