Leading News Portal in Telugu

Anand Mahindra: ఆ కాఫీ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటున్న ఆనంద్ మహీంద్ర


Anand Mahindra Praises Araku Coffee: కాఫీ, టీ తోటలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అరకు. తాజాగా ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అందులో మన దేశానికి వచ్చిన విదేశీ అతిధులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుమతులు అందించింది. వాటి ద్వారా భారత్ కు ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ బహుమతుల్లో తెలుగు వారు గర్వపడే అరకు కాఫీ కూడా ఉంది. ఇక సదస్సుకు వచ్చిన వారికి అరకు కాఫీ ఇవ్వడంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు.

భారత్ అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను, అంతర్జాతీయ స్థాయిలో తయారు చేయగలదనే దానికి నిరద్శనం అరకు కాఫీ అని ఆనంద్ మహీంద్ర పేర్కొ్న్నారు.ఓ స్పష్టమైన ఉదాహరణగా అయిన దానిని పేర్కొ్న్నారు. దీని గురించి తెలుపుతూ అరకు ఒరిజినల్స్ బోర్డ్ చైర్మన్ గా ఈ బహుమతి ఎంపికపై తాను మాట్లాడలేనని కాకపోతే ఇది తనను ఎంతో గర్వపడేలా చేసిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో భారత్ తయారు చేయగలదు అనుకోవడానికి ఇది ఉదాహరణ అని పేర్కొ్న్నారు.

ఈ విషయంలో తాను చాలా గర్వపడుతున్నట్లు పేర్కొ్న్నారు. ఇక అరకు కాఫీ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాఫీ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు దీనిని రుచి చూడాలనుకుంటారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కాఫీ ఉంటుంది.  ఇక జీ20 సమావేశాలు భారత్ లోని ఢిల్లీలో జరిగాయి. దీనికి దేశ విదేశాల నుంచి చాలా మంది నేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కూడా ఈ  సమావేశాల్లో పాలుపంచుకున్న విషయం తెలిసిందే. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేతలు చాలా మంది ఈ సందర్భంగా భారత్ లోని వివిధ ప్రదేశాలను సందర్శించారు.