Russian Sellers Stop Fertilizers Discounts to India: డీఏపీ, యూరియా రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ కు ఎరవులు సరఫరా చేయడంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న రష్యా సప్లైను కఠినతరం చేసింది. ప్రపంచ దేశాలకు చైనా కూడా ఎరువులను అందించేది. అయితే చైనా వీటి సరఫరాను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రష్యా ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ దిగింది. దీంతో రష్యా మార్కెట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. అందుకే ఎరువులపై ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేశాయి. కేవలం మార్కెట్ ధరకు మాత్రమే యూరియా, డీఏపీ లాంటి వాటిని విక్రయిస్తున్నాయని భారత ఎరువుల కంపెనీలు పేర్కొంటున్నాయి. రష్యా కంపెనీలు ఆగస్టు నెల నుంచి ఇలా చేస్తున్నాయని, దీంతో దిగుమతి ఖర్చులు భారంగా మారాయని ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి.
అయితే గతేడాది ఈ ఎరువులపై రష్యా సబ్సిడీ ఇవ్వడంతో భారతదేశం దిగుమతలు 202-23 ఆర్థిక సంవత్సరంలో 246% పెరిగి రికార్డు స్థాయిలో 4.35 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. దీని కారణంగా చైనా, ఈజిప్ట్, జోర్డాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా ఇతర ఎరువుల ఎగుమతిదారుల నుంచి భారత్ కొనుగోలులు ఘణనీయంగా తగ్గాయి. గతంలో రష్యన్ కంపెనీలు డీఏపీకి టన్నుకు 80 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చాయని ఇప్పుడు ఐదు డాలర్ల డిస్కౌంట్ కూడా ఇవ్వలేదని భారతీయ కంపెనీ ఒకటి పేర్కొంది. గ్లోబల్ ఎరువుల ధరలు గత రెండు నెలలుగా పెరుగుతున్నాయి, గోధుమ పంటకు సంబంధించి డీఏపీ డిమాండ్ పెరిగినప్పుడు రాబోయే శీతాకాలంలో స్టాక్‌లను సేకరించడం భారతీయ కంపెనీలకు సవాలుగా మారిందని ముంబైకి చెందిన ఎరువుల కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. జూలైలో, ప్రపంచ ఎరువుల సరఫరాదారులు CFR ఆధారంగా టన్నుకు సుమారు $300 చొప్పున యూరియాను అందిస్తున్నారని, కానీ ఇప్పుడు టన్నుకు $400 కోట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. జూలైలో డీఏపీ ధరలు టన్నుకు దాదాపు 440 డాలర్లుగా ఉందని ఆయన తెలిపారు. ఎరువుల ధరలు పెరగడం అనేది కచ్ఛితంగా రైతులపై భారం కానుందని చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.