India: అమెరికాలో రోడ్డు ప్రమాాదంలో మరణించిన తెలుగు యువతి మరణించడం.. ఆ మరణాన్ని తక్కువగా చూపుతూ పోలీస్ అధికారి చులకనగా మాట్లాడటంపై అమెరికా దర్యాప్తు చేయాలని ఇండియా కోరంది. వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ కార్ ఢీకొట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతి జాహ్నవి కందుల(23) మరణించింది. సియాటెల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణకు వెళ్లిన పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్, జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. తన సహోద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే జాహ్నవి మరణంపై చులకనగా మాట్లాడటం ప్రస్తుతం ఆ దేశంలో వైరల్ గా మారింది. ‘‘ఆమె ఓ సాధారణ వ్యక్తి వయసు 26 ఏళ్లు, ఈ మరణానికి విలువ లేదు, పరిహారం ఇస్తే సరిపోతుంది’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అతని సహోద్యోగితో నవ్వుతూ మాట్లాడటం వివాదాస్పదం అయింది. సోమవారం సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన వీడియోలో, ప్రమాదం గురించి చర్చిస్తున్నప్పుడు నవ్వుతూ మాట్లాడటం వినవచ్చు. అతను మాట్లాడిన మాటలన్నీ పోలీస్ అధికారి బాడీ కామ్ లో రికార్డయ్యాయి.
ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ రోడ్డు ప్రమాదంలో కందుల మరణాన్ని “తీవ్రమైన ఆందోళనకరం”గా పేర్కొంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవలని కోరింది. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సియాటెల్ అధికారులు తెలిపారు. ఏపీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జాహ్నవి సియాటెల్ లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. ఎంస్ చదివేందుకు 2021 సెప్టెంబర్ లో యూనివర్సిటీలో చేరారు.