Delhi : విద్యుత్ వినియోగాన్ని తగ్గించి.. విద్యుత్ ని ఆదా చేసేవైపుగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో “శక్తి ఆడిట్” అనే పేరుతో చర్యలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ని ఆదాచేయడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అలానే శక్తి ఆడిట్ నిర్వహించడం వల్ల విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తున్న ప్రాంతాలని సులువుగా గుర్తించవచ్చు. దీనితో ఆ ప్రాంతాలలో టెక్నాలజీ ని ఉపయోగించి విద్యుత్ వినియోగాన్ని తగించవచ్చని మంత్రి అతిషి పేర్కొన్నారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని.. నోటిఫికేషన్ జారీ చేసిన ఆరు నెలల్లోగా శక్తి ఆడిట్ ని నిర్వహించాల్సి ఉంటుంది. అనంతరం ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి శక్తి ఆడిట్ ని తిరిగి చేయించుకోవాల్సి ఉంటుంది.
సర్టిఫైడ్ ఆడిటర్ అంటే బోర్డ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)చే ధృవీకరించబడిన ఆడిటర్ మాత్రమే ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీలో 500 కిలోవాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ని వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, వాణిజ్య మాల్స్, ప్లాజాలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, గృహేతర భవనాలు, పరిశ్రమలు, బోర్డులు లేదా కార్పొరేషన్ల యాజమాన్యంలోని భవనాలు చివరికి వీధి లైట్లు కూడా ఈ శక్తి ఆడిట్ కిందకి వస్తాయి అని పేర్కొన్న అతిషి.. ప్రతి యూనిట్ విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కృషి చేతుందని ఇంధన శాఖ మంత్రి అతిషి తెలిపారు .