Comet: మరికొన్ని రోజుల్లో భూమికి దగ్గరగా తోకచుక్క రాబోతోంది. ప్రతీ 400 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది. నిషిమురా అనే తోచచుక్క ఈ ఏడాది కనిపిస్తే మళ్లీ 2455లో దర్శనమిస్తుంది. చివరిసారిగి ఇది జూలై 1588లో కనిపించింది. ఈ నిషిమురా అనే తోకచుక్క 432 ఏళ్ల కక్ష్య కాలాన్ని కలిగి ఉంది. ఇది సుదూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్ నుంచి ఉద్భవించింది. ఈ ఉర్ట్ క్లౌడ్ సౌర కుటుంబంలో అన్ని గ్రహాల తర్వాత ఉండే ప్రాంతం.
ఈ తోకచుక్క భూమికి దాదాపుగా 126 మిలియన్ కిలోమీటర్ల నుంచి వెళ్తుంది. జపనీస్ ఖగోళ ఔత్సాహికుడు హిడియో నిషిమురా ఆగస్టు 12న దీన్ని కనుగొన్నాడు. అందుకే దీనికి నిషిమురా అనే పేరు పెట్టారు. దీన్ని C/2023 P1 అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది ఇన్నర్ సోలార్ సిస్టమ్ నుంచి వెళ్తోంది. సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమికి దగ్గరగా వస్తోంది.
సెప్టెంబర్ 12న ఈ తోకచుక్క భూమికి 126 మిలియన్ల దూరంలో ఉంది. సూర్యుడి కాంతికి 15 డిగ్రీల కోణంలో కనిపించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇది సూర్యుడికి మరింత దగ్గర వస్తూ.. సెప్టెంబర్ 12న దాని పెరిహెలియన్(సూర్యుడికి దగ్గరగా ఉండే స్థానం) పాయింటుకు చేరుకుంటుంది. అయితే సూర్యుడికి దగ్గర ఉండటం వల్ల ఇది రాత్రి సమయంలో కనిపించదు. నెమ్మదిగా సూర్యుడి నుంచి దూరం జరిగే కొద్ది సెప్టెంబర్ మూడవ వారం నుంచి రాత్రి ఆకాశంలో మళ్లీ కనిపిస్తుంది.
భారతదేశంలో కనిస్తుందా..?
ఇండియాలో నిషిమురా తోకచుక్క సూర్యోదయానికి ముందు 30-40 నిమిషాల మధ్య కలిపిస్తుంది. లియో నక్షత్రరాశిలో తూర్పు- ఆగ్నేయదిశలో కనిపిస్తుంది. అయితే ఈ తోకచుక్కను పోల్చుకోవడం కష్టంగా మారవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే పొలారిస్(నార్త్ స్టార్) నక్షత్రం ప్రకాశం వల్ల తోకచుక్క సరిగ్గా కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది. బైనాక్యులర్ వంటి వాటిని ఉపయోగించి తోకచుక్కను చూడవచ్చని చెబుతున్నారు.