Leading News Portal in Telugu

Uttar Pradesh: సైకిల్పై వస్తుండగా విద్యార్థిని చున్నీ లాగిన నిందితులు.. ఆ తర్వాత ఏమైందంటే..!


ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిని వేధించిన నిందితులంతా ఫలానా వర్గానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన హన్స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హీరాపూర్‌లోని రామ్‌జీ ఇంటర్‌ కాలేజీ నుంచి విద్యార్థిని సైకిల్ పై ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి ఇద్దరు అగంతకులు బైకుపై వచ్చి చున్నీ లాగారు. దీంతో విద్యార్థి అదుపు తప్పి కింద పడిపోయింది. వెంటనే వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం విద్యార్థి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

King of Kotha : ఓటీటీ లోకి రాబోతున్న యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులు ప్రత్యేక వర్గానికి చెందినవారు కాగా.. మొదట్లో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడారు. అయితే ఆ తర్వాత సీసీటీవీ వీడియో బయటికిరావడంతో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంతకుముందు కూడా తమ కూతురిని ఫలానా వర్గానికి చెందిన యువకులు వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపినా.. పట్టించుకోలేదని తెలిపారు.

Nara Brahmani: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నేరమా..?

మరోవైపు ఈ ప్రాంతంలో తరచూ అగంతకులు రోడ్లపై తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులను ఎగతాళి చేస్తుంటారని తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు షాబాజ్, అర్బాజ్, ఫైసల్‌లపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హస్వార్ పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ రితేష్ పాండే తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును విచారిస్తున్నారు.