Leading News Portal in Telugu

Karnataka : రూ.65 లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరణ..


దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలైయ్యాయి.. ఒక్కో ఆలయంలో ఒక్కో రూపంలో వినాయకుడు దర్శనం ఇస్తున్నారు.. ఇప్పటికే పలు ఆలయాల్లో వినాయకుడి విగ్రహంను ప్రతిష్టించారు.. మాములుగా వినాయకుడు మండపాలల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ చేస్తే కర్ణాటక లోని ఓ ఆలయంలో మాత్రం కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో నిర్వహకులు గణేషుడి నవరాత్రులను నిత్య నూతనంగా నిర్వహిస్తూవుంటారు. ఏటా కొత్త దనాన్ని చూపించే నిర్వహకులు ఈ ఏడాది తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆలయాన్ని వందల కొద్ది నాణేలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాటి విలువ రూ.65 లక్షలు ఉంటుంది. అందులో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. వివిధ ఆకృతుల్లో ఆలయాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు..

అయితే ఇక్కడ వినాయడు చాలా ప్రత్యేకం.. గత కొన్నేళ్లుగా గణేష్ నవ రాత్రులకు ఆలయాన్ని పర్యావరణ హితంగా అలంకరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పూలు, మొక్కజొన్న, అరటి కాయలు, రక రకాల పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈ సారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ అలంకరణకు కరెన్సీ నోట్లను వినియోగించడం విశేషంగా చెప్పవచ్చు.. ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా భారీ లడ్డును వేలానికి పెట్టారు.. కరెన్సీ నోట్ల అలంకరణను చూడటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తున్నారు.. ఈ ప్రాంతమంతా సందర్శకులతో సందడిగా మారింది..