
Women’s Reservation Bill cleared in key Cabinet: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ కీలక బిల్లును ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది. ఇంకా నాలుగు రోజుల పాటు నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.