Women’s Reservation Bill: దాదాపుగా మూడు దశాబ్ధాల కల, మోదీ ప్రభుత్వం నెరవేర్చబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. మహిళా బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’గా పేరు పెట్టారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం కోటా రిజర్వేషన్ గా ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లు 2029లో మాత్రమే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మాత్రమే కోటా అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనాభా లెక్కలకు అనుగుళణంగా 2027లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. బిల్లు చట్టంగా మారిన తర్వా త 15 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది, దీని తర్వాత కాలవ్యవధిని పొడించవచ్చు. ఆరు పేజీల బిల్లులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ ఉంది. ఓబీసీలకు మాత్రం ఈ అవకాశం లేదని తెలుస్తోంది. రాజ్యసభ, రాష్ట్రమండలిలో ఈ రిజర్వేషన్ ఉండదు.
బిల్లులోని కీలక అంశాలివే..
* ఈ బిల్లు ద్వారా పార్లమెంట్, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడుతాయి.
* ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
* ఒక స్థానం నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ చేసేందుకు అనుమతించరు.
* బిల్లులో ఓబీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్ బిల్లు రిజర్వేషన్ ఉండదు
* డీ లిమిటేషన్ తర్వాతనే బిల్లు అమలులోకి వస్తుంది. 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది.
* డీలిమిటేషన్ కసరత్తు తర్వాత లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు కేటాయించబడిన సీట్ల రొటేషన్ జరుగుతుంది.
* భారతదేశంలో పార్లమెంటు మరియు శాసనసభలలో మహిళలు 14 శాతం మాత్రమే ఉన్నారు, ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ.