ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు. బ్యాంకులో ఎంత మొత్తం దోచుకున్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే దొంగలు ఎంత దోచుకెళ్లారోనని బ్యాంకు ఉద్యోగులు లెక్కలు వేస్తున్నారు. అయితే కోట్లాది రూపాయల దోపిడీ జరిగినట్లు భావిస్తున్నారు.
Armenia-Azerbaijan War: అర్మేనియాపై మరోసారి యుద్ధం ప్రకటించిన అజర్‌బైజాన్
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ధీమ్రాపూర్ చౌక్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో ఈరోజు ఉదయం చోరీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరుస్తుండగా ముసుగులు ధరించిన వ్యక్తులు ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులందరినీ బందీలుగా పట్టుకున్నారు. అంతేకాకుండా బ్యాంకు మేనేజర్‌పై అగంతకులు కత్తితో దాడి చేశారు. ఘటన అనంతరం దుండగులు డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై బ్యాంకు ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సుమారు 10 గంటల సమయంలో బ్యాంకు అధికారులు డయల్ 112కు సమాచారం అందించారని రాయ్‌గఢ్ ఎస్పీ సదానంద్ కుమార్ మీడియాకు తెలిపారు. కొందరు గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. దీంతో రాయ్‌గఢ్ పోలీసుల బృందం అంతా వెంటనే బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ తొడపై కత్తితో పొడిచి మిగతా సిబ్బందిని బందీలుగా పట్టుకుని దోచుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
Harish Rao: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
మరోవైపు దుండగులు ఎంత దోచుకున్నారని బ్యాంకు అధికారులు ధృవీకరించలేదు. బ్యాంకులోని సీసీటీవీని దుండగులు ధ్వంసం చేయగా. దానిని బ్యాకప్ చేస్తున్నారు. అంతేకాకుండా.. రాయ్‌గఢ్ పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాయగఢ్ జిల్లా ఒడిశా రాష్ట్రానికి అనుసంధానం కావడం గమనార్హం. ఈ ఘటనపై రాయ్‌ఘర్ పోలీసులు.. ఒడిశా పోలీసులను సంప్రదిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి జిల్లా సరిహద్దులో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.