Leading News Portal in Telugu

Rahul Gandhi: తెలంగాణపై ప్రధాని ప్రసంగం రాష్ట్రానికి అవమానం


Rahul Gandhi: తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.

“తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై ప్రధాని మోడీ అగౌరవపరిచే ప్రసంగం తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే” అని తెలుగులో ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన సందేశంలో రాహుల్‌ గాంధీ అన్నారు. సోమవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించడం రెండు రాష్ట్రాల్లో రక్తపాతానికి దారితీసిందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. అయితే, అంతకు ముందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏపీ, తెలంగాణ విభజనపై వ్యాఖ్యనించారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని ఆయన కోనియాడారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా చేశారని మోడీ తెలిపారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనంటూ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు.. జూన్ 2, 2014న రాష్ట్ర అవతరణ కల సాకారం చేసుకున్నారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.