Leading News Portal in Telugu

Gold smuggling: జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత


Jaipur: అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన బంగారం అక్రమ రావాణ ఆగడంలేదు. బంగారాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించాలని ప్రయత్నించి అధికారులకి పట్టుబడిన సంఘటనలు కోకొల్లలు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన స్మగ్లర్స్ వాళ్ళ పత్తా మాత్రం మార్చుకోవడం లేదు. బంగారం అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను కనుకుంటున్నారు. పట్టుకోలేరు అనే ధీమాతో బంగారం అక్రమ రవాణాకు పాలపడుతున్నారు. చివరికి అధికారులకి చిక్కి జైలుకి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

Read also:Lady Finger Health Benefits: బెండకాయ ఎక్కువగా తింటున్నారా? ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నాడీవ్యవస్థ ఇంకా..

వివరాలలోకి వెళ్తే.. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కోట్లు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్స్ ని పట్టుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం.. దుబాయ్ ప్రయాణికులు బంగారాన్ని పేస్ట్ గా మర్చి దానిని నడుము బెల్ట్ గా చేసి అక్రమంగా రవాణా చెయ్యాలని చూసారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుల వైకిరి పైన అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వాళ్ళని తనికీ చెయ్యగా 7కేజీల బంగారం దొరికింది. ఈ నేపథ్యంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లర్స్ ని దుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . కాగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 5 కోట్లు ఉంటుందని వెల్లడించారు అధికారులు. కాగా ఇలా బంగారాన్ని పేస్ట్ గా మార్చి బెల్టు గా చేసి అక్రమంగా రవాణా చెయ్యాలనుకోవడం ఇది మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. బంగారాన్ని పేస్ట్ గా, డస్ట్ గా మార్చి రవాణాఛాయాలనుకున్న స్మగ్లర్స్ ని గతంలో కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.