Leading News Portal in Telugu

Haryana: హర్యానాలో ఓ కాంట్రాక్టర్కు చిత్రహింసలు.. నోట్లో పేడ, ఉమ్మివేసి


హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు. అనంతరం వారి చెరనుండి బయటపడిన కాంట్రాక్టర్.. పోలీసులకు సమాచారం మొత్తం చెప్పాడు. దీంతో నిందితులు సంత్‌లాల్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు, సందీప్, వికాస్, పీకే, ఆత్మారామ్, విక్రమ్, నవీన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Lioness Dies Of Heart Attack: గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి

వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ రాకేష్ ప్రభుత్వ పనుల కోసం కాంట్రాక్టులు తీసుకుంటాడు. అయితే పొలాల్లో నిర్మించిన రెండు ఇళ్లకు వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేయాలని సదల్‌పూర్‌కు చెందిన సంతలాల్‌ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పొలాలకు వెళ్లే రహదారికి ప్రభుత్వం ఆమోదించింది.. కానీ సంతలాల్ మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పాడు. దీంతో సంతలాల్ కాంట్రాక్టర్ పై పగ పెంచుకున్నాడు.

Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..

అయితే సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల సమయంలో కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో తనను ఓ కారులో వచ్చి ఆపారని కాంట్రాక్టర్ తెలిపాడు. అంతేకాకుండా ఆ కారులో నుంచి సంత్‌లాల్ కుమారుడు సందీప్, మరో వ్యక్తి వచ్చి తనను కొట్టారన్నాడు. అంతేకాకుండా తనను కారులో తీసుకెళ్తూ కొట్టారని బాధితుడు ఆరోపించాడు. మార్గమధ్యంలో వెళ్తుండగా కళ్లకు గంతలు కట్టినట్లు రాకేష్ చెప్పాడు. పొలాల్లో నిర్మించిన ఓ ఇంటికి తీసుకెళ్లి గదిలోకి తీసుకెళ్లి బెల్టులతో కొట్టారని కాంట్రాక్టర్ చెప్పాడు. అంతేకాకుండా.. కరెంటు షాక్ లు పెడుతూ.. నోటిలో గేదె పేడ పెట్టారని తెలిపాడు. కాంట్రాక్టర్ రాకేష్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారంలో సంత్‌లాల్, అతని కుమారులతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.