Leading News Portal in Telugu

Bihar: చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి.. బంకాలో విషాదం



Bihar

చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది. గ్రామానికి చెందిన 7 ఏళ్ల కుమార్తె డోలి కుమారి, 8 ఏళ్ల కిరణ్ కుమారి, 9 ఏళ్ల బేబి కుమారి ముగ్గురూ చెరువులో స్నానానికి వెళ్లారు.

Read Also: Suriya: అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది..

చెరువు ఒడ్డున బాలికల బట్టలు కనపడటంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి.. గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ముగ్గురు బాలికలను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. అనంతరం ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Hafiz Saeed: ముంబై దాడుల ఉగ్రవాది కుమారుడు మిస్సింగ్.. గజగజ వణుకుతున్న పాకిస్తాన్..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బంకా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బరాహత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు ముగ్గురు బాలికలు చెరువులో మునిగి చనిపోయారన్నారు. మృతదేహాలను అదుపులోకి తీసుకున్నామని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు యూడీ కేసు నమోదు చేస్తామన్నారు.