Leading News Portal in Telugu

Breaking News: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ


Breaking News: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 30తో నోట్ల మార్పిడికి తుది గడువు ముగిసింది. అయితే బ్యాంకుల్లో రూ. 2000 నోట్లను మార్పిడి చేసుకునే గడువును అక్టోబర్ 7 వరకు పొడగించింది. రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ కోసం ముందుగా పేర్కొన్న వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం ప్రస్తుత ఏర్పాటును అక్టోబర్ 07, 2023 వరకు పొడగించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.