Leading News Portal in Telugu

Bike Thief: బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు


Bike Thief: బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన బీహార్‌లోని వైశాలిలో జరిగింది. స్థానికులు చెట్టుకు కట్టేసి రక్తమొచ్చేటట్టు చితకబాదారు. అతన్ని అలా కొడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చెట్టు నుంచి విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు తమ వెంట తీసుకువెళ్లారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని వైశాలి జిల్లా మహువా పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్‌పూర్ చౌక్‌లో బైక్ ను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మాస్టర్ కీతో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిపై దాడి చేశారు. అంతేకాకుండా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఇదిలా ఉంటే.. యువకుడిపై ఇప్పటికే దొంగతనం కేసులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా.. దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మరోసారి దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఈ కేసులో పోలీసులు అతనిపై దర్యాప్తు ప్రారంభించారు.