Leading News Portal in Telugu

Uttar Pradesh: “నాపై చేతబడి చేస్తున్నారు”.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..


Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వింత ఆరోపణలు చేశారు. ప్రజలు తనపై చేతబడి ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా మెమహ్మదీ ఎమ్మెల్యే అయిన లోకేంద్ర ప్రతాప్ సింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేస్తున్నారని, ఓ ఫోటోను పోస్ట్ చేశారు.

తాను భోలేనాథ్(శివుడి) భక్తుడిని అని తనకు ఏం జరగదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే చేతబడి అని ఆరోపిస్తూ పోస్ట్ చేసిన ఫోటోలో ఆయన చిత్రం, కూరగాయలు, ఒక సీసా, మరికొన్ని వస్తువులు ఒక ఎర్రని వస్త్రంలో ఉండటం చూడవచ్చు.

మేము చంద్రుడిపైకి చేరుకున్నాము. ఇంకా కొంతమంది చేతబడిని నమ్ముతున్నారు. దేవుడు వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని ప్రతాప్ సింగ్ అన్నారు. నేను భోలేనాథ్ కి అమితమైన భక్తుడినని, ఇలాంటి మాయలతో తనకు ఏం జరగదని, ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మేవారిది దిక్కుమాలిన మనస్తత్వం అని ఎమ్మెల్యే అన్నారు. ఇదిలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ చేతబడుల అనుమానంతో హత్యలు జరగడం కూడా చూడవచ్చు.