Leading News Portal in Telugu

Delhi: 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు


రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. మయూర్‌విహార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ టైలర్ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన వద్దకు బట్టలు కొనేందుకు వచ్చిన బాలికపై ఈ అఘాయిత్యం చేశాడు. అయితే నిందితుడి చెర నుంచి తప్పించుకుని బాలిక ఎలాగోలా తన ఇంటికి చేరుకుని తన తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. అయితే ఆ బాలిక మాటలు విన్న తల్లి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Crime News: దారుణం.. చిన్నారిని కిరాతకంగా రాయితో కొట్టి హతమార్చిన సవతి తల్లి

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 12 ఏళ్ల బాలిక 7వ తరగతి చదువుతుంది. సెప్టెంబరు 27న.. ఆ బాలిక పాఠశాల నుండి వచ్చి భోజనం చేస్తుండగా.. ఆమె తల్లి ఆమెను, ఆమె చెల్లెలను సమీపంలోని టైలర్ ఇబ్రాన్ భయ్యా నుండి బట్టలు తీసుకురావాలని కోరింది. చెల్లెలు నిరాకరించడంతో బట్టలు కొనేందుకు టైలర్ వద్దకు బాలిక ఒంటరిగా వెళ్లింది. దీంతో బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అమానుషమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక అతని బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి జరిగిన మొత్తం విషయాన్ని తల్లికి తెలిపింది.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో పతకాల జోరు.. 60కి చేరిన భారత్ పతకాల సంఖ్య

అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న 19 ఏళ్ల నిందితుడు ఇబ్రాన్‌ను.. యూపీలోని ఖోడాలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ అమృత గుగులోత్ తెలిపారు. అతనిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.