Navi Mumbai: మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. వావీవరసలు మరిచి మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. పరువు కోసం బయటకు రాని కేసులు అనేకం ఉంటున్నాయి.
తాజాగా నవీ ముంబై ప్రాంతంలో ఓ సవతి తండ్రి గత రెండేళ్లుగా 15 ఏళ్ల కూతురుపై అత్యాచారం చేస్తున్నాడు. ప్రాణాలతో బయటపడిన బాలిక బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 2021, అక్టోబర్ 2023 మధ్య తన సవతి తండ్రి తనపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని, అసహజ సెక్స్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తను కొట్టి, చంపేస్తానని బెదిరించాడని బాలిక ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండేళ్లుగా సవతి తండ్రి చేస్తున్న అఘాయిత్యాలను మౌనంగా భరిస్తున్న బాలిక, వేధింపులు ఎక్కువ కావడంతో ధైర్యం చేైసి పోలీసులు ఆశ్రయించిందని అధికారులు వెల్లడించారు. నిందితుడిపై అత్యాచార సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.