Leading News Portal in Telugu

Rahul Gandhi: అమ్మ సోనియాకు రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..


Rahul Gandhi: కాంగ్రెస్ అధినే రాహుల్ గాంధీ, తన తల్లి సోనియాగాంధీక సర్‌ఫ్రైజ్ గిఫ్టు ఇచ్చారు. ఒక కొత్త వ్యక్తిని తన కుటుంబంలో పరిచయం చేశారు. సోనియా గాంధీకి ఒక పెంపుడు కుక్కను గిఫ్టుగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆగస్టు నెలలో గోవా నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ అనే కుక్క పిల్లను తీసుకువచ్చాడు. దీనికి ‘నూరీ’ అనే పేరు పెట్టారు. నార్త్ గోవాలోని మపుసాలోని కుక్కల పెంపకం కేంద్రం నుంచి నూరీని దత్తత తీసుకున్నారు.

ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీకి సర్‌ఫ్రైజ్ గిఫ్టు ప్లాన్ చేశారు. ఒక చిన్న బాక్స్ లో నూరీని ఉంచి, సోనియా గాంధీని గిఫ్ట్ ఓపెన్ చేయాలని రాహుల్ గాంధీ చెప్పడం, ఆ తరువాత గిప్టు ఓపెన్ చేసిన సోనియా గాంధీ ముద్దుగా ఉన్న కుక్కను చూసి ఎంతో మురిసిపోయారు. ఆత్మీయంగా కొడుకు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.