వీటితో పాటు కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి మరో రూ.100 సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఆగస్టులో ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం రూ. 200 సబ్సిడీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సబ్సిడీ రూ.300కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. నేటి నుంచి ఉజ్వల పథకం లబ్ధిదారులకు సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచుతున్నారు. కేబినెట్ నిర్ణయాల గురించి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రూ.1,600 కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేస్తున్నామని, ఇప్పుడు రూ.8,400 కోట్లకు చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, జాతీయ పసుపు బోర్డును సృష్టించడం అవసరం.