ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో కారుపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి చెందారు. కైలాష్-మానసరోవర్ మార్గంలో కారు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కొండచరియలు విరిగిపడటంతో రాళ్లు, బండరాళ్లు పడ్డాయి. దాదాపు 24 గంటల తర్వాత సోమవారం శిథిలాల నుండి ఏడుగురి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.
ఈ సంఘటన ఉత్తరాఖండ్ జిల్లాలోని థక్తి ప్రాంతానికి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. మృతులు గుంజి నుండి ధార్చులకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పితోర్‌గఢ్ ADM శివ్ కుమార్ బరన్వాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు Mr బరన్వాల్ తెలిపారు. SDRF, ITBP, ఆర్మీ పోలీసు సిబ్బంది, స్థానికులు మృతదేహాలను భారీ శిథిలాల నుండి తీయడానికి చాలా కష్టపడ్డారని ఆయన చెప్పారు.
మృతులు కోపిల (13), కాశీష్ (10), నితిన్ (5), తుల రాం (62), ఆశాదేవి (56), డ్రైవర్ కిషన్‌గా గుర్తించారు. వీరంతా బలుకోట్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఒకరిని ఇంకా గుర్తించాల్సి ఉందని ఏడీఎం తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి శిథిలాలను తొలగించామని.. ట్రాఫిక్ క్లియర్ చేసి రహదారిని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.