Leading News Portal in Telugu

Israel-Hamas War: భారత్‌లోని ఇజ్రాయిలీలకు భద్రత.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు..


Israel-Hamas War: భారత్‌లోని ఇజ్రాయిలీలకు భద్రత.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు..

Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి, తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళం విరుచుకుపడుతుంది. ఇదిలా ప్రపంచంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. కొందరు భారత్, అమెరికా, యూరప్ లోని పలు దేశాలు ఇజ్రాయిల్ కి మద్దతు తెలుపుతుండగా.. ఇరాన్, సౌదీ, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం, అరబ్ రాజ్యాలు ప్రత్యేక పాలస్తీనాకు, హమాస్ కి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం, యూదుల పవిత్ర స్థలాలకు భద్రత పెంచారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఇజ్రాయిలీల భద్రత కోసం కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇజ్రాయిల్ దౌత్యవేత్తలు, సిబ్బంది, పర్యాటకులకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల అధికారులను కోరింది.

ఇజ్రాయిల్ లో పెరుగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీతో సహా అనేక దేశాలు యూదులను లక్ష్యంగా చేసుకుని పాలస్తీనా మద్దతుదారులు దాడులకు తెగబడవచ్చనే అనుమానాల నేపథ్యంలో భారత్ కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది.