Leading News Portal in Telugu

Bihar Crime News: యూట్యూబ్ లో ఫెమస్ అయితే చంపేస్తారా..? ఇదెక్కడి న్యాయం..!


Bihar Crime News: యూట్యూబ్ లో  ఫెమస్ అయితే చంపేస్తారా..? ఇదెక్కడి న్యాయం..!

Bihar Crime News: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అంటే ఏ పని చేసిన పిడికెడు అన్నం కోసమే. దాని కోసం మనిషి నానాయాతన పడుతుంటారు. ప్రస్తుతం యూట్యూబ్ హావ నడుస్తుంది. కొందరు నేమ్, ఫేమ్ కోసం యూట్యూబ్ ని ఎన్నుకుంటే.. కొందరు వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి యూట్యూబ్ ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో క్లిక్ అయితే నేమ్, ఫేమ్ తోపాటు మంచి సంపాదన కూడా వస్తుంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఓ ఆసరా దొరుకుతుంది అనుకునే వాళ్ళు ఎందరో. అయితే ఆ యూట్యూబ్ లో ఫేమ్ రావడం తో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే..బీహార్ లో హరధన్ అనే 19 ఏళ్ళ యువకుడు తండ్రిని కోల్పోయాడు. దీనితో కుటుంబ భారం ఆ యువకుడి పైన పడింది. ఈ నేపథ్యంలో తన తల్లిని, ఇద్దరు సోదరీమణులను పోషించుకునేందుకు హరధన్ యూట్యూబ్‌లో ట్యూషన్లు మరియు రీల్స్ అప్‌లోడ్ చేసేవాడు.

Read also:Plane Crashed: కుప్పకూలిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్.. పైలట్ ఏమయ్యాడంటే

కాగా హరధన్ కి యూట్యూబ్ లో మంచి గుర్తింపు వచ్చింది. హరధన్ కి వచ్చిన ఈ ఫేమ్ అతని మరణానికి కారణం అయింది. హరధన్ కి నేమ్, ఫేమ్ రావడాన్ని చూసి ఓర్వలేని వ్యక్తులు బీహార్‌లోని నలందలో తన ఇంట్లో నిద్రిస్తున్న హరధన్ ను పదునైన కత్తితో విచక్షణారహితంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు గుమిగూడి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హరధన్ సోదరి మాట్లాడుతూ తనకి యూట్యూబ్ లో ఫేమ్ రావడం వల్లనే అతన్ని హత్య చేశారని తెలిపింది. కాగా ఈ హత్యకు కేవలం యూట్యూబ్ ఫేమ్ మాత్రమే కారణమా..? లేక వేరే కారణాలు ఎం అయినా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు.