
Asaduddin Owaisi: స్వాతంత్య్రానికి ముందు దేశ విభజన గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన జరగాల్సింది కాదని, చారిత్రక తప్పిదమని సోమవారం అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చారిత్రత్మకంగా ఇది ఒకే దేశమని, దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని అన్నారు.
కావాలంటే చర్చ ఏర్పాటు చేయాలని, దేశ విభజనకు కారకులెవరో నేను మీకు చెబుతాను, ఈ సమయంలో జరిగిన విభజనను ఒక్క లైన్ లో చెప్పలేనని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ పుస్తకాన్ని చదవాలని, విభజన ప్రతిపాదనను అంగీకరించవద్దని ఆయన కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి వేడుకున్నారని ఆయన తెలిపారు. ఆ సమయంలో విభజనకు అక్కడ ఉన్న అందరు నాయకులు బాధ్యులే అని చెప్పారు. అప్పటి ఇస్లామిక్ పండితులు కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని ఓవైసీ పేర్కొన్నారు.