Leading News Portal in Telugu

Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు కుంభకోణం”.. టీఎంసీ ఎంపీపై కేంద్ర ఐటీశాఖ మంత్రికి ఫిర్యాదు..


Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు కుంభకోణం”.. టీఎంసీ ఎంపీపై కేంద్ర ఐటీశాఖ మంత్రికి ఫిర్యాదు..

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభలో చర్చల సమయంలో ప్రశ్నించడానికి ఓ వ్యాపారవేత్త నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ నిన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే ఉత్తరం రాశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ, ఎంపీ మహువా మొయిత్రాల మధ్య లంచాల మార్పిడి జరిగిందని, సుప్రీంకోర్టు లాయర్ నునంచి తనకు తిరుగులేని సాక్ష్యాలు అందాయని నిషికాత్ దూబే లేఖలో ప్రస్తావించారు.

తాజా సంఘటన 2005 నాటి ‘క్యాఫ్ ఫర్ క్వేరీ’ కుంభకోణాన్ని గుర్తు చేస్తుందని, దీనిపై విచారణ కమిటీ వేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరోసారి మొయిత్రాపై పదునైన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. మహువా మొయిత్రా తన లోక్‌సభ వెబ్‌సైట్ లాగిన్ వివరాలను హీరానందానీ, అతని గ్రూపుకు అందిచారని, దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లకు లేఖను రాశారు.

మొయిత్రా లోక్ సభ ఖాతా ఆమె లేని సమయంలో ఎక్కడెక్కడి ఐపీ అడ్రస్‌ల నుంచి లాగిన్ యాక్సెస్ అయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాలని ఆయన కోరాడు. తన వాదనలు, ఆరోపణలు నిజమైతే మహుమా మొయిత్రా దేశభద్రతపై తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుందని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.

మోయిత్రా ప్రవర్తన “అనైతికం, చట్టవిరుద్ధం మరియు దేశ భద్రతకు హానికరం” అని పేర్కొన్న దూబే, ఆమెపై వచ్చిన ఆరోపణలను “అత్యంత తీవ్రంగా” పరిగణించాలని ఐటి మంత్రిత్వ శాఖను కోరారు. అంతకుముందు స్పీకర్ కి రాసిన లేఖలో ఎంపీ మొయిత్రా పార్లమెంట్ లో అడిగని 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూపుపైనే అడిగారని, ఉద్దేశపూర్వకంగా సదరు కంపెనీని ఇబ్బందులు పెట్టాలనే ఇలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.