Leading News Portal in Telugu

Delhi News: తన ప్రియురాలిని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చిన ప్రియుడు


Delhi News: తన ప్రియురాలిని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చిన ప్రియుడు

Delhi News: దక్షిణ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలిని వేధిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపాడు మైనర్ బాలుడు. మృతుడు భాటి మైన్స్ ప్రాంతానికి చెందిన గంగారాం అలియాస్ సంజయ్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర గాయాలైన వ్యక్తి గురించి ఆసుపత్రి నుండి సమాచారం వచ్చిందని తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని అతని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు. తీవ్ర గాయాలైన గంగారాం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందిందని డీసీపీ పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. అయితే నిందితుడు మైనర్ అని డీసీపీ తెలిపారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మైనర్ నిందితుడిని విచారిస్తున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నాడు. గంగారాంను కత్తితో పొడిచి చంపినట్లు హంతకుడు అంగీకరించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడు తన ప్రియురాలిని వేధిస్తున్నాడన్న కారణంతో హత్యకు పాల్పడట్లు పోలీసులు పేర్కొన్నారు.