Leading News Portal in Telugu

PM Modi: పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ.. మానవతా సాయంపై హామీ..


PM Modi: పాలస్తీనా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ.. మానవతా సాయంపై హామీ..

PM Modi: పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను పెంచుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడితో యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మాట్లాడారు.

సోమవారం గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై బాంబుదాడిలో వందలాది మంది చనిపోవడంపై ప్రధాని నరేంద్రమోడీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిస్తూనే ఉంటామని హమీ ఇచ్చారు. తీవ్రవాదంపై, ఈ ప్రాంతంలో హింస, ఆందోళనను పంచుకున్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారతదేశ దీర్ఘకాలిక సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు. ఈ విషయాలను ప్రధాని తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు, 200 మంది వరకు ప్రజలను బందీలుగా చేసుకున్నారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ వైమానిక దళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో 3000 మంది వరకు చనిపోయారు. అంతకుముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. తీవ్రవాదంపై పోరుకు ఇజ్రాయిల్ కి మోడీ మద్దతు ప్రకటించారు.