Leading News Portal in Telugu

NewsClick Case: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్‌ఆర్ హెడ్‌లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు


NewsClick Case: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్‌ఆర్ హెడ్‌లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

NewsClick Case: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు 2023 అక్టోబర్ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారం పొడిగించింది. ఈ కేసులో ప్రబీర్ పుర్కాయస్థ, చక్రవర్తిలకు శుక్రవారంతో కోర్టు విధించిన 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ ఈరోజు వారి జ్యుడీషియల్ కస్టడీని ఐదు రోజులు పొడిగించారు. న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు చైనా అనుకూల ప్రచారం కోసం భారీగా డబ్బులు అందాయనే ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) నిబంధనల కింద నమోదైన కేసులో ఢిల్లీ పోలీసులు ఇటీవల వారిని అరెస్టు చేశారు.

ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగిసిన తర్వాత శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ప్రబీర్ పుర్కాయస్థ తరపున న్యాయవాది వాదించారు. ఆయననుప్రశ్నించారని, వారి ప్రశ్నలన్నింటికీ పుర్కాయస్థ సమాధానం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని పుర్కాయస్థ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. “ఈ కేసులో బాంబును(డైనమైట్ లేదా మరేదైనా పేలుడు పదార్థం) ఉపయోగించినట్లు ఎటువంటి ఆరోపణ లేదు. ఆయన(పుర్కాయస్థ) ఏదైనా నేరపూరిత శక్తిని ఉపయోగించానని లేదా ఏ ప్రజా కార్యకర్త మరణానికి కారణమయ్యానని ఎటువంటి ఆరోపణ లేదు. రిపోర్టింగ్ ద్వారా, నటించడం ద్వారా లేదా జర్నలిస్టుగా వృత్తిని కలిగి ఉండటం ద్వారా ఉగ్రవాద చర్యకు ఎలా పాల్పడగలరు? ?. ఆయు ఏదైనా కథనం ద్వారా కేంద్ర ప్రభుత్వ కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తితే, అది తీవ్రవాద చర్య కదా” అని పుర్కాయస్థ తరపు న్యాయవాది కోర్టు ముందు తన వాదనలో పేర్కొన్నారు. న్యాయవాది తన క్లయింట్ జర్నలిస్టుగా పేరుపొందారని, స్వతంత్ర స్వరానికి పేరుగాంచిన వ్యక్తి అని పేర్కొన్నారు. “కానీ వారు (ఏజెన్సీ) ఉపా చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆయన ఉపా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ నవ్లాఖాతో సంబంధం కలిగి ఉన్నారు అని ఏజెన్సీ ఆరోపించింది. కేవలం ఒకరితో అనుబంధం నేరంగా మారిందా?” అని న్యాయవాది వాదించారు.

హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి తరఫు న్యాయవాది రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “అమిత్‌ చక్రవర్తి జర్నలిస్టు లేదా ఎడిటర్‌ కాదు. ఆయన ఎటువంటి కథనాన్ని రాయలేదు. 2021 నుంచి అమిత్‌కువివిధ సందర్భాల్లో ఏజెన్సీల ద్వారా సమన్లు అందాయి. బ్యాంకు ఖాతాలు, ఇమెయిల్‌ల గురించి చాలా సమాచారం – ప్రతిదీ స్వాధీనం చేసుకున్నారు. ఆయనను ఎప్పుడూ అరెస్టు చేయలేదు. వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన కంటెంట్‌కు ఆయన ఏ విధంగానూ బాధ్యత వహించరు. అమిత్ చక్రవర్తి అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను నిర్వర్తిస్తారు.. అయితే ఈ కేసులో ఆయనను హఠాత్తుగా ఎందుకు అరెస్టు చేశారో తెలియదు.” అని వాదనలు వినిపించారు.

న్యూస్ వెబ్ పోర్టల్ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తన ఎఫ్‌ఐఆర్‌లో పలు విషయాలను పేర్కొంది. ఈ న్యూస్‌ వెబ్‌ పోర్టల్‌ PPK న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. కుట్రలో భాగంగా కోట్లాది రూపాయల అక్రమంగా రూట్ చేయబడిన విదేశీ నిధులకు బదులుగా పెయిడ్ న్యూస్ ద్వారా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి లిమిటెడ్ ఉపయోగించబడిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.