
political news: కర్ణాటకలో విద్యుత్తు సంక్షోభం నెలకొంది. కర్ణాటక ప్రజలు కరంట్ కోతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి ఆ రాష్ట్ర మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కృత్రిమ విద్యుత్తు కొరతని సృష్టిస్తున్నదని ఆరోపించారు. రానున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ అధిష్ఠానానికి కావాల్సిన ఫండ్స్ కోసమే సిద్ధరామయ్య సర్కారు ప్రైవేట్ విద్యుత్తు సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేస్తుందని.. ఇలా ఆ సంస్థల నుంచి భారీగా దండుకొన్న కమీషన్ల సొమ్మును రానున్న ఎన్నికలు కోసం వ్యచించాలని యోచిస్తున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also:Health Tips : బాదాంను రోజూ తింటున్నారా? ఆ ప్రమాదాలు ఉన్నాయని తెలుసా?
అలానే విద్యుత్తు కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు వనరుల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి పుష్కలమైన అవకాశం ఉన్నప్పటికీ, కృత్రిక కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జికి డబ్బుకు కొరత లేదు అని వెల్లడించిన ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడి చేస్తుండడం తోనే జార్జి కమీషన్లు వసూలు చేస్తున్నాడేమో అని అన్నారు. డబ్బును లూటీ చేసేందుకు పథకాలను ఎలా వాడుకోవాలో.. ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలో కాంగ్రెస్ సర్కారుకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 15 మెగావాట్ల విద్యుత్తు కొరతని ఎదుర్కొంటున్నదని, ఈ నేపథ్యంలో విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం సిద్ధరామయ్య చెప్పారని, అయితే ప్రభుత్వం గత ఐదు నెలలుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని, సంక్షోభానికి ప్రభుత్వ చర్యలే కారణమని విమర్శించారు.