Leading News Portal in Telugu

Sushil Kumar Shinde: రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సుశీల్ కుమార్ షిండే


Sushil Kumar Shinde: రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సుశీల్ కుమార్ షిండే

Sushil Kumar Shinde: సుశీల్ కుమార్ శంభాజీ షిండే గురించి పరిచయం అవసరం లేదు. 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షోలాపూర్ సెషన్స్ కోర్టులో బెయిలిఫ్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత మహారాష్ట్ర పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అనంతరం అతను ఆరు సంవత్సరాలు మహారాష్ట్ర CID లో పనిచేశాడు. కాగా 1971లో షిండే కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చేరిన ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. తొలిసారిగా 2003లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈయన 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు.

Read also:Etela Rajender: రాజగోపాల్ రెడ్డి ఎలా మాట మార్చారు..? ఈటెల ఫైర్..

కాగా అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. అలానే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగాను.. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. అయితే తాజాగా ఆయన రాజకీయాలకు స్వస్తి పలుకుతూ రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి స్థానంలో రాజకీయ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఆమె ఇప్పటికే షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్న ఆమె రాబోయే ఎన్నికల్లో షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.