
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఉన్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి కొదువ లేదు. అయితే ప్రస్తుతం ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పులిగోరు ధరించి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో, ఆయనపై అధికారులు దృష్టి సారించారు.
ఇటీవల పులి గోరు లాకెట్టు ధరించిన దర్శన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల శ్రీ క్షేత్ర హోరనాడు ఆలయాన్ని సందర్శించిన సమయంలో దర్శన్ మెడలో ఉన్న పులిగోరు ఫోటోలు బయటకు వచ్చాయి. జనతా పార్టీకి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
అటవీ శాఖ అధికారులు బుధవారం దర్శన్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం, వన్యప్రాణులను చంపడం మరియు వాటి గోళ్లు, చర్మాలు, కొమ్ములు మొదలైన వాటిని కలిగి ఉండటం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరం. బెంగళూర్ లోని అతని ఇంటిలో పులిగోళ్లు ఉన్నాయో లేదో అని అటవీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.