
Viral News: ఓ టెక్కీ ఊబర్ మెటో డ్రైవర్‌గా మారిపోయాడు.. ఇది టెక్కీల సందడి దండిగా కనిపించే బెంగళూర్ సిటీలో.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అంటేనే లక్షల్లో జీతాలు.. అలాంటి వాడు అసలు ఊబర్ డ్రైవర్‌గా ఎందుకు మారుడు అనే విషయాన్ని తెలుసుకుంటే నోరువెల్లబెట్టాల్సిందే.. ఇంతకీ.. బెంగళూర్‌లో వెలుగు చూసిన ఆ టెక్కీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఊబర్ మోటో డ్రైవర్ గూగుల్ మాజీ ఉద్యోగి అని తెలియడంతో ఓ వ్యక్తి ఆశ్చర్యానికి లోనయ్యాడు. రాఘవ్ దువా అనే వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.. దీంతో.. పలువురు నెటిజన్లు తమకు ఎదురైన అలాంటి అనుభవాల పంచుకోవడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది..
అయితే, తమ బైక్-ట్యాక్సీ డ్రైవర్‌కు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు బెంగళూర్ వ్యక్తి గుర్తించడం ఇదే మొదటిసారి కాదట.. రాఘవ్ దువా అనే నెటిజన్ వెల్లడించిన ప్రకారం.. ఇటీవల బెంగళూర్‌కు వెళ్లాడు.. సిటీ చూసేందుకు ఊబర్ బైక్‌ను బుక్ చేసుకున్నాడు.. ఆపై తన డ్రైవర్ గూగుల్ మాజీ ఉద్యోగి అని గుర్తించి షాక్ తిన్నాడు.. అతడు ఈ మధ్యే బెంగళూర్‌కు వచ్చినట్టు తెలుసుకున్నాడు.. అతడు ఊబర్ డ్రైవర్‌గా ఎందుకు మారాడు? అనే విషయాలపై ఆరా తీశాడు.. నగరంలో విస్తృతంగా తిరిగేందుకు తాను డ్రైవర్‌గా మారిపోయాయనని.. హైదరాబాద్ నుంచి 20 రోజుల కిందటే బెంగళూరు వచ్చానని.. సిటీ మొత్తం చూసేద్దాం అనే ఈ పని ఎంచుకున్నట్టు చెప్పాడంటూ రాఘవ్ దువా సోషల్ మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నాడు..
“నా ఉబర్ మోటో డ్రైవర్ ఎక్స్-గూగుల్ ఉద్యోగి.. హైదరాబాద్ నుండి 20 రోజుల క్రితం బెంగుళూరుకు వచ్చాడు.. అతను కేవలం నగరాన్ని అన్వేషించడానికే ఇలా చేస్తున్నాడు” అని పేర్కొంటూ.. ట్విట్టర్‌లో కామెంట్ చేస్తూ దువా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.. X వినియోగదారులు వారి స్వంత ‘పీక్ బెంగళూరు’ క్షణాలను పంచుకోవడంతో, పోస్ట్ త్వరగా దృష్టిని ఆకర్షించింది, ఇక్కడ సాధారణ అనుభవాలు అసాధారణమైన అనుభూతిని కలిగి ఉంటాయి. ఈ సంఘటన కొత్త చర్చకు దారి తీసింది.. ఒక వ్యక్తి తమ మనోగతాన్ని వ్యక్తం చేయడంతో, ఇది నిజంగా మనోహరమైనది! మీ రైడ్ సమయంలో మీరు ఆసక్తికరమైన సంభాషణను కలిగి ఉన్నారని నేను ఆశిస్తున్నాను!” మరొక వినియోగదారు తమ స్వంత అనుభవాన్ని పంచుకున్నారు.. ఇక, మూడో వ్యక్తి హాస్యభరితంగా “బెంగళూరులో, మీరు గాలిలో రాయి విసిరితే, అది పక్షిని లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను తాకుతుంది” అని చమత్కరించారు.