
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య జరిగిన సమావేశం గురించి ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. తామిద్దరం పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. అదానీ వ్యవహారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య ఈ భేటీ ఈడీ, సీబీఐల ప్రయేయాన్ని పెంచుతుందా..? అంటూ కేంద్రంపై వ్యంగాస్త్రాలు సంధించారు.
పుల్వామా, రైతుల నిరసన, అగ్నివీర్ వంటి అంశాలపై గవర్నర్, మాజీ రైతు నాయకుడు, మాజీ ఎంపీ సత్యపాల్ మాలిక్ తో ఆసక్తికరమైన చర్చ అంటూ రాహుల్ గాంధీ అన్నారు. ఇరువురి మధ్య చర్చల సమయంలో రాహుల్ గాంధీ, సత్యపాల్ మాలిక్ రాజకీయ జీవితం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను 1973 నుంచి రాజకీయ జీవితంలో ఉన్నానని మాలిక్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ గురించి అడిగినప్పుడు.. జమ్మూ కాశ్మీర్ ని ఫోర్సెస్, ఆర్మీ కానీ నిర్వహించలేవని ఆయన అన్నారు.
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా తక్షణమే ఇవ్వాలని, ఆర్టికల్ 370 రద్దు కన్నా, రాష్ట్ర హోదా తీసేయడం వారిని ఎక్కువగా బాధించిందని సత్యపాల్ మాలిక్ అన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారు, ప్రతీ చోటా ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. తాను పుల్వామా విషయంలో హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీతో ప్రస్తావించారు. దీనిని వారు ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని పరోక్షంగా బీజేపీని నిందించారు.
పుల్వామా దాడిలో కారణమైన, సీఆర్పీఎఫ్ వాహనంపైకి దూసుకెళ్లిన వాహనం గత 10 రోజులుగా అదే ప్రాంతంలో తిరిగిందని, దాన్ని చెక్ చేసేవారే లేరని, వాహనం డ్రైవర్, ఓనర్ కి ఉగ్రవాద రికార్డులు ఉన్నాయని, వారిని అంతకుముందు అరెస్ట్ చేశారు, విడుదల చేశారు, కానీ ఇంటెలిజెన్స్ రాడార్ లో లేరని, పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తెప్పించారని మాలిక్ ఆరోపించారు.
అదానీ రైతుల దగ్గర నుంచి పంటలు కొనేందుకు పెద్ద గోడౌన్స్ నిర్మించాడు, దీంతోనే ఎంఎస్పీపై ప్రభుత్వం తన హమీని నిలబెట్టుకోలేదని, అదానీ పేరు ప్రభుత్వంతో నిలిచిపోయిందని, ప్రతీ గ్రామంలో దాని గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం డబ్బు అంతా అదానీ వద్ద ఉందని ప్రజలు అంటున్నారని సత్యాపాల్ మాలిక్ అన్నారు. మణిపూర్ హింసపై మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నియంత్రణ లేదని దుయ్యబట్టారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు.
क्या ये संवाद ED-CBI की भाग दौड़ बढ़ा देगा?
पुलवामा, किसान आंदोलन और अग्निवीर जैसे महत्वपूर्ण मुद्दों पर राज्यपाल, पूर्व सांसद और किसान नेता, सत्यपाल मलिक जी के साथ दिलचस्प चर्चा!
पूरा वीडियो मेरे यूट्यूब चैनल पर देखिए। pic.twitter.com/tIGkXDRjzD
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2023