
సినీ హీరోలకు అభిమానులు ఉంటారు.. వారి నటన, జనాల్లో వాళ్లు నడుచుకోవడం వంటి వాటి వల్ల ఆ హీరోల పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటారు.. వారికోసం ఏదైనా చేస్తాము అనుకుంటారు.. మరికొందరు తమ అభిమాన హీరోను దేవుడుగా భావించి గుడి కట్టిస్తుంటారు.. ఇటీవల చాలా మంది తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టిన వార్తలను వింటూనే ఉన్నాం.. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకపోతే ఓ రజినీ అభిమాని తన హీరోకు గుడి కట్టించి రోజూ పూజలు చేస్తున్నాడు.. అందుకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
కుష్బూ, నయనతార, సమంత, నీతి అగర్వాల్ వంటి హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టడం గురించి విన్నాం. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఒకరు ఆయనకు గుడి కట్టేశాడు. అంతేనా నిత్యం పూజలు, హారతులు, అభిషేకాలు చేస్తున్నాడు.. అందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు.
ఇక ఆ విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నాడు. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయాడు.. ఇదిలా ఉండగా.. రజనీకాంత్ తాజాగా లీడర్ 170 మూవీతో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ముంబయిలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లీడర్ 170 సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది..