Leading News Portal in Telugu

Kerala serial blasts: “కాంగ్రెస్, సీపీఎం బుజ్జగింపు రాజకీయాల ఫలితం”.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..


Kerala serial blasts: “కాంగ్రెస్, సీపీఎం బుజ్జగింపు రాజకీయాల ఫలితం”.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

Kerala serial blasts: కేరళలో ఆదివారం జరిగిన వరస పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పేలుళ్లలో ఇప్పటికే ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కలమస్సేరిలో జరిగే ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల కేరళలో పాలస్తీనా, హమాస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీల అనంతం పేలుళ్లు సంభవించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే కేరళ పేలుళ్లు ఇప్పడు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్, అధికార సీపీఎం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పేలుళ్లను ఖండించిన రాజీవ్ చంద్రశేఖర్.. ‘‘సీపీఎం, కాంగ్రెస్ పార్టీల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం వల్ల అన్ని వర్గాలకు చెందిన అమయాకపు ప్రజలు మూల్యాన్ని భరిస్తున్నాడరు.. అదే మన చరిత్ర నేర్పింది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఒక రోజు క్రితం కేరళలో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు వర్చువల్ గా పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘బుజ్జగింపు రాజకీయాలు- కాంగ్రెస్/సీపీఎం/యూపీఏ/ఇండియా కూటమి ప్రమాణాలు సిగ్గు చేటని తీవ్రవాద హమాస్ ను ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఆహ్వానించాయి. కేరళలో జిహాద్ కి పిలుపునిచ్చాయి. ఇది బాధ్యతరహిత పిచ్చి రాజకీయాల ఔన్నత్యం చాలు’’ అంటూ వ్యాఖ్యానించారు.

మీరు మీ పెరట్లో పాములు పెంచుకోలేదరు, అవి మీ పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించకూడదు, అవి మీకు కూడా ప్రమాదకరమే అని హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్ ను ఉద్దేశించి చెప్పిన వ్యాఖ్యల్ని మరోసారి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేరళ పేలుళ్లపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. కేరళ పోలీసులు కూడా ప్రత్యేక టీముల్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. పేలుళ్లతో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.