
Srinagar: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. టార్గెటెడ్ దాడులకు ఒడిగట్టారు. శ్రీనగర్ లో స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరపడంతో అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని భద్రత బలగాలు చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. దాడికి పిస్టల్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీనగర్ లోని ఈద్గా సమీపంలో ఉగ్రవాదులు ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్‌పై కాల్పులు జరిపి గాయపరిచారు. అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము అని కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్(ట్విట్టర్)లో తెలిపారు. ప్రస్తుతం పోలీస్ అధికారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో టార్గెటెడ్ కిల్లింగ్ పెరిగాయి. భారీ దాడులకు చేసేందుకు ఉగ్రవాదులకు భద్రతా బలగాలు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో హైబ్రీడ్ ఉగ్రవాదానికి తెరలేపారు. జమ్మూ కాశ్మీర్ లోని నాన్ లోకల్స్, డైలీ లేబర్స్, పండిట్లను, హిందువులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ దాడులకు పాల్పడిన వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దాడికి పాల్పడిన వ్యక్తులను హతమారుస్తున్నాయి భద్రతా బలగాలు.
#WATCH | Jammu and Kashmir: A police official was shot at Eidgah in Srinagar. He has been shifted to a hospital. Further details awaited. pic.twitter.com/vR6HmN1F4Q
— ANI (@ANI) October 29, 2023