
Delhi Rule: మాంసం దుకాణాలు, మతపరమైన ప్రదేశాల మధ్య కనీసం 150 మీటర్ల దూరం ఉండేలా ఎంసీడీ(Municipal Corporation of Delhi) హౌస్ పాలసీని ఆమోదించింది. మాంసం దుకాణాల కోసం కొత్త లేదా పునరుద్ధరించబడిన లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రతిపాదిత విధానంలో భాగంగా ఈ రోజు ఎంసీడీ హౌస్ ఆమోదం తెలిపింది. ఎంసీడీ హౌస్ దాని క్లుప్త కార్యకలాపాల సమయంలో గందరగోళం మధ్య ఆమోదించిన అనేక ప్రతిపాదనలలో ఇది ఒకటి.
ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఎజెండా ప్రకారం మాంసం దుకాణాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ లేదా స్టోరేజీ ప్లాంట్ల కోసం కొత్త లైసెన్సుల మంజూరు లేదా లైసెన్స్‌ల పునరుద్ధరణకు ప్రతిపాదిత విధానానికి ఆమోదం లభించింది. హౌస్ ప్రొసీడింగ్స్ ప్రకారం మాంసం దుకాణం.. దేవాలయం, మసీదు, గురుద్వారా లేదా ఇతర మతపరమైన ప్రదేశాల మధ్య కనీసం 150 మీటర్ల దూరం ఉండాలని ప్రతిపాదన షరతు విధించింది.