Leading News Portal in Telugu

Tutor Boyfriend Killed Boy: ట్యూషన్‌ టీచర్ ఇంట్లో శవమై తేలిన పదోతరగతి విద్యార్థి.. అసలేం జరిగిందంటే?


Tutor Boyfriend Killed Boy: ట్యూషన్‌ టీచర్ ఇంట్లో శవమై తేలిన పదోతరగతి విద్యార్థి.. అసలేం జరిగిందంటే?

Tutor Boyfriend Killed Boy: పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్‌కు పంపించారు. ఇలా టీచర్‌ దగ్గర ట్యూషన్‌కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్‌ టీచర్‌ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్‌ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నివాసముంటున్న 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థి అతని ఇంటి సమీపంలో ఉండే రచిత అనే టీచర్‌ దగ్గరికి ప్రతిరోజు ట్యూషన్‌కు వెళ్లేవాడు. సాయంత్రం ట్యూషన్ చెబుతున్న ట్యూషన్‌ టీచర్ రచితకు ప్రభాత్‌ శుక్లా అనే ప్రియుడు ఉన్నాడు. ట్యూషన్‌ టీచర్, విద్యార్థి మధ్య ఏదో నడుస్తోందని అనుమానించిన ప్రియుడు బాలుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం.. రచిత పిలుస్తోందని విద్యార్థిని తనతో పాటు బైక్‌పై తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి స్టోర్‌రూమ్‌లోకి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 20 నిమిషాల తర్వాత ఆ గది నుంచి ప్రభాత్ శుక్లా ఒక్కడే బయటకి వచ్చాడు. అ తర్వాత అతడు దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే బాలుడు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆ అబ్బాయి కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్ని చోట్ల వెతికినా అబ్బాయి కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సహా, ట్యూషన్‌ టీచర్‌ రచిత, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మరోవైపు కిడ్నాప్‌ చేసినట్లు విద్యార్థి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పకముందే.. బాలుడ్ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

నిందితుడు బాధితుడి కుటుంబానికి రాన్సమ్ నోట్ కూడా పంపి దానిని కిడ్నాప్ చేసినట్లుగా చూపించాడు. హత్యకు గురైన 17 ఏళ్ల బాలుడి తండ్రి కాన్పూర్‌లో పెద్ద వ్యాపారవేత్త అని తెలిసింది. హత్యకు ముందు బాలుడిని వదిలిపెట్టాలంటే రూ. 30 లక్షల రూపాయలు ఇవ్వాలని అతని తండ్రిని ప్రభాత్ డిమాండ్ చేశాడని పోలీసులు విచారణలో తేలింది. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఉపాధ్యాయ, విద్యార్థి సంబంధమే హత్యకు కారణమని మరో కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదే కాకుండా.. ట్యూషన్‌ టీచర్‌, ప్రియుడి విషయంలో ఆమె భర్తకు చెప్తాడనే భయంతో విద్యార్థిని హత్య చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.