Leading News Portal in Telugu

Train accident: పట్టాలు తప్పిన ఘాజీపూర్ ట్రైన్.. లైన్ క్లియర్ చేసిన అధికారులు


Train accident: పట్టాలు తప్పిన ఘాజీపూర్ ట్రైన్.. లైన్ క్లియర్ చేసిన అధికారులు

Suhel Dev Super Fast Express: దేశంలో పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగంరం రైలు ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో రైలు ప్రమాదానికి గురైంది. ట్రైన్‌ నంబర్(22419)సుహెల్‌దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఘాజీపూర్ సిటీ నుంచి ఆనంద్‌ విహార్‌ వెళ్లేందుకు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌ నుండి బయలు దేరింది. అయితే బయలు దేరిన కొంత సమయం లోనే రైలు యొక్క రెండు భోగీలు పట్టాలు తప్పాయి. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో రైలు లోని ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదం కారణంగా కొంత సమయం ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.

Read also:IND vs SL: జర్నలిస్ట్ అవతారమెత్తిన టీమిండియా స్టార్ బ్యాటర్.. అమ్మాయికి షాక్ ఇస్తూ..! జడేజా కూడా గుర్తుపట్టలే

తరువాత రైలు పట్టాలు తప్పడానికి గల కారణాల గురించి పరిశీలించారు. ఈ క్రమంలో ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ.. ట్రైన్‌ నంబర్(22419)సుహెల్‌దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ రైలు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌ సిబ్బంది గ్రీన్‌ సిగ్నల్ తీసుకుని 6వ నంబర్ ఫ్లాట్‌ఫామ్‌ నుండి బయలు దేరిందని.. కాగా కొంత దూరం వెళ్ళాక రైలు యొక్క రెండు భోగీలు పట్టాలు తప్పాయని.. ఈ నేపథ్యంలో రైలు ఆగిపోయిందని తెలిపారు. కాగా రైలు కి ప్రమాదం ఏమి జరగలేదని వెల్లడించిన అధికారులు.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. అయితే ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలు నిలిపివేశామని తెలిపిన అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వెంటనే సమస్యను పరిష్కరించి లైన్ క్లియర్ చేశామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.